చాలా మంది టోపీలను ధరిస్తారు. కానీ దాని మీద బటన్ ఎందుకు ఉంటుందో తెలియదు. బట్టలతో టోపీలను తయారుచేసేటప్పుడు వివిధ పరిమాణాలలో కట్ చేసి టోపీని కుడుతారు. ఈ క్రమంలో టోపీకి ఉపయోగించిన బట్ట ముక్క చివరలు ఒకే దగ్గరకు వస్తాయి. అక్కడ కుట్లు వేస్తే అంత బాగా కనిపించదు. అందుకని వాటిని దాచేందుకు పైభాగంలో ఒక బటన్‌ను పెడతారు. ఈ బటన్‌ని 'స్క్వాచీ' లేదా 'స్క్వాట్చో' అని పిలుస్తారు.