మరో కొత్త వైరస్ కలకలం.. మెదడుకి జ్వరం.. ఆపై మరణం

68చూసినవారు
మరో కొత్త వైరస్ కలకలం.. మెదడుకి జ్వరం.. ఆపై మరణం
ఢిల్లీలో జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనే మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా జపనీస్ ఎన్సెఫాలిటిస్ జ్వరం కేసు నమోదైంది. ఈ వైరస్ జంతువులు, పక్షుల నుంచి దోమలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వస్తే తొలుత సాధారణ జ్వరం వస్తుంది. ఆ తర్వాత అది తీవ్రమై మెదడుకు సోకుతుంది. ఇలా జరిగిన గంటల వ్యవధిలోనే మరణం సంభవిస్తుంది. అయితే డెంగ్యూ, మలేరియా లాగా ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించదు.

సంబంధిత పోస్ట్