బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఏటా 1.35 లక్షల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించింది. అవామీ లీగ్ ప్రభుత్వం 2009 నుంచి 2023 వరకు ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిందని పేర్కొంది. ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ దేబప్రియ భట్టాచార్య ఈ శ్వేతపత్రాన్ని రూపొందించటంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.