నగల దుకాణం యజమానిని మాటల్లో పెట్టి నలుగురు మహిళలు నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఓ నగల దుకాణంలోకి వచ్చిన నలుగురు మహిళలు ఆ షాపు యాజమానితో ఆభరణాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో అతను ఓ మహిళకు నగలు చూపిస్తుండగా.. వెనకాలే ఉన్న ఇద్దరు మహిళలు అందినకాడికి చోరీ చేశారు. ఈ మేరకు దోచుకున్న నగల ఖరీదు రూ.16.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం.