కొత్త రేషన్‌కార్డులను ‘స్మార్ట్’ కార్డుల రూపంలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. అందరికీ స్మార్ట్ రేషన్‌కార్డులు జారీ చేయనుంది. ఈ మేరకు సర్కారు టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు మార్చి 25వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ప్రీబిడ్ సమావేశాన్ని మార్చి 17న నిర్వహిస్తామని పేర్కొంది.