ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆ రాష్ట్రానికి మార్చుతున్నారు. గతేడాది సీఎం జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, కార్యాలయాలను ఏపీకి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD)కు ఆదేశాలు జారీ చేశారు.