అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరిగి భూమి మీదకు రావడం మరింత ఆలస్యం కానుంది. సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ను మార్చి 16న భూమి మీదకు తీసుకురానున్నట్లు నాసా ఇటీవల ప్రకటించింది. వారిని భూమి మీదకు తీసుకొచ్చేందకు గురువారం చేపట్టిన క్రూ 10 మిషన్ ప్రయోగం వాయిదాపడింది. రాకెట్‌లో సమస్యలు తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. దీంతో సునీతా రాక మరింత ఆలస్యం కానుంది.