రంగుల పండుగ వచ్చేసింది. చిన్నారుల నుంచి పెద్దల దాకా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రంగుల్లో అధికంగా కెమికల్స్ కలపడం వల్ల అవి పూసుకుంటే చర్మంతో పాటు కళ్లకు కూడా హాని కలిగిస్తాయట. అయితే హోలీ జరుపుకోవడానికి ముందు శరీరమంతా నూనె రాసుకోవడం మేలని సూచిస్తున్నారు. అలాగే జుట్టుకు నూనె పట్టిస్తే జుట్టుకు నష్టం కలగదని వివరిస్తున్నారు.