సంక్రాంతి పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో మంగళవారం మాంసం ధరలు పెరిగాయి. నిన్న మొన్నటి వరకు గొర్రె, మేక మాంసం విక్రయదారులు కిలోకు 7 వందల రూపాయలకు అమ్మగా కిలో మాంసం ధర 8 వందలకు అమ్మారు. అయినా పండుగ పూట మాంసాహార ప్రియులు తండోపతండాలుగా ఎగబడి మాంసాన్ని కొనుగోలు చేశారు. పండుగ కాబట్టి అధిక ధరలైన కొనక తప్పడం లేదని మాంసం కొనుగోలు దారులు లోకల్ ఆప్ కు తెలిపారు.