జల్- జంగల్- జమీన్ ఉద్యమం

53చూసినవారు
జల్- జంగల్- జమీన్ ఉద్యమం
కుమ్రం భీం జల్- జంగల్- జమీన్.. అని నినాదం ఎత్తుకున్నాడు. ఈ నీరు- అడవి- భూమిపై హక్కులు తమవేనంటూ ఉద్యమం ప్రారంభించాడు. ఏ నాటికైనా చచ్చేదే, ఈ బతుకు కంటే ఆ చావే గొప్పదంటూ తన తోటి వారిలో ఉద్యమ స్ఫూర్తి రగిలించాడు. మేమూ తోడవుతాం అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఆయన అనుచరులుగా తరలివచ్చారు. భీం నాయకత్వంలో గూడెం ఊర్లన్నీ తన వెంటే నడిచాయి. ఇక వారితోనే జోడేఘాట్ కేంద్రంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పర్చుకొని నిజాం పాలకులపై గెరిల్లా పోరాటాలకు దిగాడు భీం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్