భీం చేపట్టిన సాయుధ ఉద్యమంతో గూడెంలలో నైజాం పాలన గాడి తప్పింది. దీంతో తనకు, వారికి భూములిస్తాం, టాక్సులెత్తివేస్తాం అంటూ ప్రభుత్వం నుంచి ఆఫర్లు వచ్చాయి. అయినా సరే వాటికి భీం లొంగలేదు. తమ బతుకులు మారాలంటే తమ ప్రాంతంలో పాలన తమదే అయి ఉండాలి అని భీం తెగేసి చెప్పాడు. దీంతో భీంను మట్టుబెట్టాలని నైజాం ప్రభుత్వం ప్లాన్ వేసింది. భీంకు సన్నిహితంగా మెలిగే కుర్దు పటేల్ సహాయంతో నైజాం ఆర్మీ కుమ్రం భీంపై తూటాల వర్షం కురిపించడంతో 39 ఏళ్లకే 1940లో కొమరం భీం నేలరాలాడు.