సంక్రాంతి వేళ జల్లికట్టు ఆటలు జోరుగా జరుగుతాయి. జల్లికట్టు అనగానే ముందుగా మనకు ఏపీలోని తిరుపతి జిల్లా గుర్తుకు వస్తుంది. చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం అనుపల్లి గ్రామంలో భోగి రోజే జల్లికట్టు ఆటలు ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాల్లో వందల సంఖ్యలో యువకులు పాల్గొంటారు. జల్లికట్టు కోసం ఎద్దులు కట్లు తెంచుకుని రంకెలు పెడతాయి. పశువులను అందంగా అలంకరిస్తారు. నాలుగు రోజులపాటు జల్లికట్టు ఆటలు నిర్వహిస్తారు.