దేశవ్యాప్తంగా బుధవారం జరిగిన JEE మెయిన్ పేపర్-1 పరీక్ష మధ్యస్థంగా ఉన్నట్లు విద్యార్థులు, నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు ఒకే స్థాయిలో ఉన్నాయని, NCERT సిలబస్ ఆధారంగా ప్రశ్నలిచ్చారని తెలిపారు. మూడు సబ్జెక్టులుండగా, ఒక్కో సబ్జెక్టులో 10-15 ప్రశ్నలు సాధారణ విద్యార్థులు కూడా జవాబులు రాసేలా ఉన్నాయని, సన్నద్ధమైన విద్యార్థులు 300కి 100 మార్కులు సాధించడం కష్టం కాదని చెబుతున్నారు.