ఆఫ్రికాలోకీ జియో ఎంట్రీ

85చూసినవారు
ఆఫ్రికాలోకీ జియో ఎంట్రీ
భారత టెలికాం మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న రిలయన్స్‌ జియో.. ఆఫ్రికాకూ విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఘనాకు చెందిన నెక్ట్స్‌-జెన్‌ ఇన్‌ఫ్రాకోతో(NGIC) చేతులు కలపనుంది. ఘనాలో 5జీ అమలుకు కావాల్సిన మౌలిక వసతులను ఎన్‌జీఐసీ ఏర్పాటు చేయనుంది. అందుకు అవసరమయ్యే పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, అప్లికేషన్లను ర్యాడిసిస్‌ సమకూర్చనున్నట్లు ఎన్‌జీఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది.

సంబంధిత పోస్ట్