మహారాష్ట్రలో ప్రతిపక్ష నేత, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్
బీజేపీ-శివసేన (షిండే) వర్గంలో చేరిపోయారు. మరో 29 పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంటే నడిచారు. ఈ తరుణంలో ఎన్సీపీ నుంచి మహారాష్ట్ర అసెంబ్లీలో కొత్త ప్రతిపక్ష నాయకుడిగా జితేంద్ర అవద్ నియమితులయ్యారు. "ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ఉండండి సార్" అంటూ ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో ఉన్న చిత్రాన్ని అవద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.