కాంగ్రెస్ కార్పొరేటర్‌కు జేపీ నడ్డా పరామర్శ

58చూసినవారు
కాంగ్రెస్ కార్పొరేటర్‌కు జేపీ నడ్డా పరామర్శ
ప్రేమను నిరాకరించడంతో నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్‌ (24) అనే యువకుడు ఇటీవల కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనపై పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హుబ్లిలో బాధిత కుటుంబాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరామర్శించారు. విద్యార్థిని తండ్రి, కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ నిరంజన్‌ హీరేమఠ ఇంటికి వెళ్లిన నడ్డా ఆ దంపతులను కలిసి ధైర్యం చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you