ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద శనివారం ఎస్ఐ ఇంద్రకరణ్ రెడ్డి తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి ఎవరూ వాహనాలను నడపరాదని ఎస్ఐ అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు.