AP: శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో ఓ ప్రైవేట్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. హోలీ సందర్భంగా విద్యార్థినులను ఎత్తి బురదలో పడేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా, ప్రిన్సిపాల్ వెంకటపతి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినులతో ఆ రకంగా ప్రవర్తించడం మంచి ఆలోచన ధోరణి కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.