అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 41 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించాలని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అఫ్గానిస్థాన్, ఇరాన్, ఉత్తర కొరియా వంటి 10 దేశాలకు వీసా పూర్తిగా నిలిపివేయనున్నారు. మయన్మార్, హైతీ వంటి దేశాలకు పాక్షిక ఆంక్షలు, పాకిస్థాన్ సహా 26 దేశాలకు భద్రతా మెరుగుదల కోసం 60 రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉంది.