భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలానికి చెందిన కూలీ వెంకటేశ్వర్లుకు జీఎస్టీ కార్యాలయం నుంచి రూ.22.86 లక్షల బకాయిల నోటీసు వచ్చింది. భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ పేరిట రూ.1 కోటి వ్యాపారం చేశారని విజయవాడ కమర్షియల్ టాక్స్ విభాగం పేర్కొంది. కానీ తనకు వ్యాపారం చేయడం తెలియదని, తన ఆధార్ నంబర్‌ను దుర్వినియోగం చేసి ఎవరో పాన్ కార్డు పొందారని వెంకటేశ్వర్లు పేర్కొంటున్నారు.