బాన్సువాడ నియోజకవర్గ మాల సంఘం నాయకులు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అధ్యయన సమావేశంలో వర్గీకరణను వ్యతిరేకిస్తూ జస్టిస్ సమీం అక్తర్ కమిటీకి నివేదికను గురువారం నిజామాబాద్ లో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ AMC మాజీ చైర్మన్ నేర్రె నర్సింలు, నిజామాబాదు మాలల సంఘాల JAC కో ఛైర్మెన్ ప్రదీప్, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మన్నే చిన్న సాయిలు పాల్గొన్నారు.