బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్రటేరియట్ ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌస్, చాకలి సాయిలు, మహేష్, శివ సూరి, మొగులయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.