మహమ్మద్ నగర్: ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
By MOHSIN 71చూసినవారుమహమ్మద్ నగర్ మండలాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆలయాలపై దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు బుధవారం నిజాంసాగర్, మహమ్మద్ నగర్ ఉమ్మడి మండలాల బంద్‌కు పిలుపునిచ్చాయి. దుకాణాలు, ప్రైవేట్ స్కూళ్లు, పెట్రోల్‌బంక్‌లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. నిజాంసాగర్, బీర్కూర్ ఎస్సైలు సుధాకర్, రాజశేఖర్, నస్రుల్లాబాద్ ఏఎస్సై వెంకట్రావు బందోబస్తు నిర్వహిస్తున్నారు.