2024 డిఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు డీఈఓ ల ద్వారా నియామక పత్రాలు అందుకొని బుధవారం తమకు కేటాయించిన స్థానాలలో విధి నిర్వహణలో చేరారు. ఇందులో భాగంగా గాంధారి మండలం ముదేల్లి గ్రామానికి చెందిన నిరోష గౌరారం లోని ఉన్నత పాఠశాలలో బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా బుధవారం విధులలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామ ప్రజల అభినందనలు తెలిపారు.