ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సామర్థ్యాల గుర్తింపు పరీక్ష

75చూసినవారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సామర్థ్యాల గుర్తింపు పరీక్ష
పిట్లం మండలం చిల్లర్గి, మద్దెల చెరువు పాఠశాలల్లో మంగళవారం విద్యార్థుల్లో విద్యాప్రగతి అంశాల పరిశీలనకై చేపట్టిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే(నాస్)కు సంబంధించిన ప్రారంభ పరీక్షను నిర్వహించారు. 3, 6 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించడానికి ఈ పరీక్షను విద్యాశాఖ నిర్వహిస్తుందని నోడల్ అధికారి రమణ అన్నారు. నోడల్ అధికారి రమణ, మండల విద్యాధికారి దేవిసింగ్ పరీక్ష రాస్తున్న విద్యార్థులను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్