జుక్కల్ యూత్ ఫోరమ్ సభ్యుల ముందస్తు అరెస్ట్

1103చూసినవారు
జుక్కల్ యూత్ ఫోరమ్ సభ్యుల ముందస్తు అరెస్ట్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో సోమవారం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. అయితే ఈ సభను ఉద్దేశించి జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జుక్కల్ కు వచ్చే అర్హత కేసీఆర్ కు లేదని జుక్కల్ యూత్ ఫోరం సభ్యులు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో గాయక్వడ్ విఠల్, అయిల్వార్ మారుతి, జాధవ్ సాయికర్ణ, బిరదరు మారుతి, బండారి బాలాజీలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్