ఇల్లు కాలిపోయిన కుటుంబానికి ఆర్థిక సహకారం అందజేత

561చూసినవారు
ఇల్లు కాలిపోయిన కుటుంబానికి ఆర్థిక సహకారం అందజేత
మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో ప్రమాద శాత్తూ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తి స్థాయిగా కాలిపోవడం తో మూడు కుటుంబాలు విదిన పడిన విషయం పాఠకులకు తెలిసిన విషయం. మద్నూర్ గ్రామానికి చెందిన మునుర్ కాపు అధ్యక్షుడు విజయ్ బండివార్ (పశు వైద్యుడు) తన వంతు 5 వేల రూపాయలు , మద్నూర్ కేంద్రానికి చెందిన శ్రీ సాయి దుర్గ గ్రూప్ సభ్యులు 5 వేల రూపాయలు ఆర్థిక సహకారం తమ వంతుగా పేద కుటుంబానికి అందించడం జరిగింది. శనివారం రోజున విజయ్ బండివార్ (పశు వైద్యుడు) శ్రీ సాయి దుర్గ గ్రూప్ సభ్యులు మెనూర్ గ్రామంలోని సొసైటీ లో నివసించే హైమాది బి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఇల్లు యొక్క కాలిన దృశ్యాలు సామాగ్రి అగ్నికి ఆహుతి అయిన దృశ్యాలు చూసి మద్నూర్ వాసులు బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించి మేము ఉన్నాం మీరు దిగులు పడకంటి మీకు మా తరుపు నుంచి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని విజయ్ బండివార్ , కృష్ణ పటేల్ , ప్రకాష్ సెట్  కుటుంబ సభ్యులకు భరోసా కల్పించడం జరిగింది. ప్రమాద శాత్తూ ఇంట్లోని వస్తువులు పూర్తి స్థాయిగా కాలి బురుదైన సామగ్రి  ఒక గిన్నె ఒక చంచా కూడా మిగల కుండ నష్టం వాటిల్లిందని తెలిపారు. మద్నూర్ కేంద్రానికి చెందిన విజయ్ బండివార్ , శ్రీ సాయి దుర్గ గ్రూప్ సబ్యులకు పేద వారికి ఆపదలో ఉన్నప్పుడు వారికి ఏదో ఒక రూపంలో తమ వంతు ఆర్థిక సహకారాలు అందిస్తున్న సందర్భంగా మద్నూర్ కేంద్ర ప్రజలతో పాటు మండల ప్రజలు వీరి యొక్క సేవాలను హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. మెనూర్ లోని బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహకారం అందించిన మద్నూర్ వాసులకు మెనూర్ గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కుటుంబం అన్ని రకాలుగా నష్టపోవడం తో దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరడం జరుగుతుంది. ఆర్థిక సహకారం లో మద్నూర్ వాసులు , మెనూర్ గ్రామ బి. ఆర్. యస్. పార్టీ అధ్యక్షుడు గోవింద్ , సామాజిక సేవాకుడు జంషెడ్ వార్ అశోక్ పటేల్ , మొహమ్మద్ పటేల్ , సంపత్ సర్ , సతీష్ సర్ , సంగాయప్ప , కంచిన్ వార్ యాదరావు , విట్ఠల్  , తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్