జుక్కల్ నియోజకవర్గంలోని ఆయా మండలాలతో పాటు మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించి పేద ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని రాములు కోరడం జరిగింది. శనివారం రోజున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నియోజక వర్గంతో పాటు డోoగ్లీ నూతన మండలం ప్రారంభోత్సవం కార్యక్రమానికి వచ్చే సందర్భంగా నియోజక వర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా సమయ పాలన పాటించి రోగులకు వైద్య సేవాలు అందించాలని కోరారు. కేవలం ఎన్నికల దృష్ట్యా వాగ్దానాలు ఇవ్వకుండా చిత్త శుద్దితో ఇచ్చిన హామీలపై పనులు చేసి చూపెట్టాలని కోరారు. లేని యెడల నియోజక వర్గంలో ప్రజలతో కలసి మరొక ఉద్యోమం , ఆందోళన , నిరసనలు ప్రారంభం చేయడం జరుగుతుందని తెలిపారు.