బిచ్కుంద మండల ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి వారి విధుల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవడంతో మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే హనుమన్ షిండే కు బిచ్కుంద మండల ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ మాజీ చైర్మన్ నాల్చర్ రాజు, డాక్టర్ రాజు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ అధ్యక్షులు గణపతి, ఉపాధ్యక్షులు బాలయ్య, కార్యదర్శి వీరేశం,యు మండల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.