కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యల సంతోష్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాల సంఘం కమిటీ అధ్యక్షులుగా రాతన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిరడి మైసయ్య, కోశాధికారి ప్రభాకర్, ఉపాధ్యక్షులను, సభ్యులు నియమించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సాయిలు, శ్రీనివాస్, సాయిలు, మైసయ్య, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.