నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ లో ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై అందజేస్తున్న ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేప పిల్లల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపారు.