కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం బిక్నూర్ మండలం రామేశ్వరంపల్లిలో.. ముంపుకు గురైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వారి కోసం అప్పర్ ప్రైమరీ స్కూలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస శిబిరాన్ని పరిశీలించారు. ముందుగా పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఎక్కడ నిర్లక్ష్యం చేయరాదని రెవిన్యూ అధికారులను ఆదేశించారు.