రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

80చూసినవారు
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
రైతులు పండించిన వరి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పట్టణ సొసైటీ అధ్యక్షులు భూమయ్య చెప్పారు. భిక్కనూరు మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అకాల వర్షాల వల్ల వరి ధాన్యం బస్తాలు తడిసిపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు ఏర్పడడంతో ఆయన తూకం వేసే వద్దకు వెళ్లి తడిసిన వరి ధాన్యం బస్తాలను పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు.