ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన

81చూసినవారు
ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
ఐఆర్‌సీటీసీ (IRCTR)లో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై రైల్వేశాఖ తాజాగా స్పందించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. పర్సనల్‌ యూజర్‌ ఐడీతో కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్‌.. ఎవరికైనా ఈ-టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఒక ఐడీతో నెలకు 12 టికెట్లు, ఆధార్‌ అనుసంధానం పూర్తి చేసుకున్నవారు నెలలో 24 టికెట్లు వరకూ బుక్‌ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్