Apr 04, 2025, 15:04 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి: మెడికల్ కళాశాలలో అక్రమ నియామకాలను రద్దు చేయాలని నిరసన
Apr 04, 2025, 15:04 IST
మెడికల్ కళాశాలలో కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఇటీవల నియమించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడం జరిగిందని పలువురు ఆరోపించారు. రోస్టర్ నిబంధనలను పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలను ఇచ్చారని, తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి అన్యాయం చేయడం జరిగిందని ఆరోపిస్తూ తెలుగు నాడు విద్యార్థి సమైక్య, తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు.