ఏపీసీసీ చీఫ్ షర్మిలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అని మర్చిపోయి, చంద్రబాబు చేతిలో పప్పెట్ లాగా తయారయ్యారని విమర్శించారు. 25 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ ఆస్తిలో వాటా అడగడం ఏమిటని మండిపడ్డారు. అలాగే సీఎం చంద్రబాబుకు అవసరం అయినప్పుడు షర్మిల వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు.