ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఔట్ అయ్యారు. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో 10.4 ఓవర్‌కు కార్బిన్ బాష్‌కు క్యాచ్ ఇచ్చి రిషభ్ పంత్ (2) పెవిలియన్ చేరారు. రూ.27 కోట్ల జీతం అందుకున్న ప్లేయర్ రిషభ్ పంత్ 2 పరుగుల అతి తక్కువ స్కోర్‌కు మరోసారి ఔట్ అవ్వడం గమనార్హం. ఈ సీజనలో 4 మ్యాచ్‌లు కలిపి పంత్ మొత్తం 19 పరుగులే చేశారు.