నాగిరెడ్డిపేట్ మండలం తాండూర్ గ్రామానికి చెందిన దూదేకుల నసీర్ అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న దూదేకుల నసీర్ కుటుంబసభ్యులు ఎమ్యెల్యే మదన్ మోహన్ ను ఆశ్రయించారు. స్పందించిన ఎమ్యెల్యే ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 2, 00, 000 రూపాయల ఎల్ఓసిని, కాంగ్రెస్ పార్టీ నేతల ద్వారా రోగి ఇంటికి వెళ్లి సోమవారం అందించే ఏర్పాటు చేశారు.