రైతుల ఉద్యమంపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు

75చూసినవారు
మూడు వ్యవసాయ చట్టాల రద్దుకోసం రైతులు చేసిన ఆందోళనపై బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లయితే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్‌ తరహా పరిస్థితులు తలెత్తేవని ఇటీవల ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. రైతు ఉద్యమ సమయంలో శవాలు వేలాడుతూ ఉండేవని, అత్యాచారాలు జరిగేవని కంగన ఆరోపించారు. ఉద్యమం వెనుక చైనా, అమెరికాల కుట్ర ఉందని చెప్పారు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆక్షేపణ తెలిపాయి.

సంబంధిత పోస్ట్