సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం సచివాలయానికి రానున్నారు. తొలుత ఈఈఎస్ఎల్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డయేరియా సమస్యలు తలెత్తినందున రక్షిత మంచినీరు సరఫరా పథకంపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత స్పోర్ట్స్ పాలసీపై అధికారులతో చర్చిస్తారు సాయంత్రం హడ్కో చైర్మన్‌తో సమావేశం అవుతారు.