సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ
బెజ్జంకి కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు 25 లక్షల 23 వేల రూపాయలను చెక్కుల రూపంలో అందజేశారు.