కరీంనగర్: రేవంత్ రెడ్డి, కేటిఆర్ లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రేవంత్ రెడ్డి, కేటిఆర్ లపై శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డికి పాదయాత్ర చేసే దమ్ముందా అని అన్నారు. అలాగే గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒప్పుకునే దమ్ముందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వి అన్ని ఉత్తర కుమార ప్రగల్బాలే అని సెటైర్లు వేశారు.