గుగ్గిళ్లలో పౌర హక్కుల దినోత్సవం

69చూసినవారు
గుగ్గిళ్లలో పౌర హక్కుల దినోత్సవం
బెజ్జంకి మండలం గుగ్గిళ్లలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల గ్రామానికి చెందిన జనగాం జిల్లా కార్మిక శాఖ అధికారి ర్యాకం కుమారస్వామి, ఆర్. ఐ సంతోష్ కుమార్, గ్రామ పౌరులు, గ్రామ పారిశుధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్