కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షా నగర్ నుంచి గంగాధరరికి వెళ్లే రహదారిలో గుర్తు తెలియని మృతదేహం గురువారం లభ్యం అయింది. వరద కాలువ బ్రిడ్జి వద్ద ముళ్ల పొదల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతదేహం ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందనే విషయం తెలియాల్సి ఉంది.