బోయినిపల్లి: వరిలో చీడపీడలపై రైతులకు అవగాహన సదస్సు
బోయినిపల్లి మండలంలోని తడగొండ గ్రామంలో జిల్లా ఏరువాక కేంద్రం కరీంనగర్ శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో వరిలో చీడపీడల యాజమాన్యంపై రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వరిలో ప్రధానంగా వచ్చే మొగి పురుగు లక్షణాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. నారుమడి దశలో కార్బో ఫ్యురెన్ 800 గ్రా. ఒక ఎకరాకు సరిపడే నారుమడిలో నాట్లు వేసే వారం రోజుల ముందు గుళికలను చల్లుకోవాలని తెలిపారు.