ధర్మారం: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాగ్రి పంపిణీ
ధర్మారం మండలంలోని శాయంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలకలు, నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. అదే గ్రామంలోని పేద మహిళకు కుట్టు మిషన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ లయన్ రవీందర్ శెట్టి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముజాహిద్, ట్రెజరర్ కట్టర్ రమేష్, సభ్యులు ఉప్పలంచ దయానంద్, తదితరులు పాల్గొన్నారు.