జగిత్యాల జిల్లా కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది ఏకీన్ పూర్ కు చెందిన అంబటి వెంకటి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. న్యాయవాది హఠాన్మారణం పట్ల బార్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారు అంత్యక్రియలు ఉదయం 11: 00 గంటలకు వారి స్వగృహం ఏకీన్ పూర్ నుండి నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.