జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

70చూసినవారు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్
జగిత్యాల కలెక్టరెట్ లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ప్రభుత్వ విప్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్