హుస్నాబాద్: దీపావళి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

76చూసినవారు
హుస్నాబాద్: దీపావళి వేడుకల్లో పాల్గొన్న మంత్రి
హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన దీపావళి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనారు. నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి లక్ష్మీ పూజ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి క్రాకర్స్ కాలుస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలనలో లక్ష్మీ కటాక్షం దీవెనలు ప్రజలపై ఉండి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో హయిగా జీవించాలన్నారు.