అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ దినోత్సవ వేడుక
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రామకృష్ణాపురం గ్రామంలోని అంగన్వాడి 2 కేంద్రంలో శనివారం ఉదయం 11: 30 గంటల సమయంలో గ్రాడ్యుయేషన్ డేను 3 నుండి 5 సంవత్సరాల పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు, గ్రామస్తులకు అంగన్వాడి ఎడ్యుకేషన్ గురించి వివరించి, పిల్లలతో ప్రీస్కూల్ యాక్టివిటీ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్, తదితరులు పాల్గొన్నారు.